గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (18:38 IST)

కరివేపాకుతో డయాబెటిస్ పరార్.... బరువు తగ్గాలనుకుంటే..?

కరివేపాకు డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. కరివేపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. అవి బాడీలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కరివేపాకులు తింటే మేలు. 
 
వంటల్లో కరివేపాకుని ఉపయోగించడంతో పాటు జుట్టు సమస్యలకి, అందానికి కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కరివేపాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరివేపాకులో ఫైబర్, ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.  
 
జుట్టు సమస్యలకు కూడా కరివేపాకు మంచి పరిష్కారం చూపిస్తుంది. శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకులు తరిమేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెడతాయి. కరివేపాకు దగ్గు, జలుబును దూరం చేస్తుంది. 
 
కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు... కరివేపాకుల్ని ఉడకబెట్టి... తాగితే మంచిది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు కరివేపాకులు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని కూడా కాపాడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.