ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (00:04 IST)

పగిలిన అద్దాలు.. తెగిపోయిన చెప్పులు.. ఇంట్లో వుంచితే..?

ఆరోగ్యం, ఆనందంతో వుండాలంటే.. ఇంట్లో ఇవి ఉండకూడదు అంటున్నారు.. వాస్తు నిపుణులు. ఇంట్లో ఉండే దేవతల ఫోటోలు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పగిలి పోయిన లేదా విరిగి పోయిన దేవుడు బొమ్మలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉపయోగించవద్దు.
 
దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని గుర్తుంచుకోండి. అదే విధంగా పని చేయని గడియారాలు ఇంట్లో ఉంచుకోండి. పని చేయని గడియారాలు కారణంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనితో ఆనందంగా ఉండలేరు.
 
తెగిపోయిన చెప్పులు వంటివి కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది. వీటి వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఇటువంటి వాటిని ఇంట్లో నుండి దూరంగా ఉంచడం మంచిది.
 
అలానే చిరిగిపోయిన బట్టలని కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తొలగించడం మంచిది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుందని వాస్తు నిపుణులు సెలవిస్తున్నారు.