బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరిక
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. దిలీప్ కుమార్ ఇద్దరు తమ్ముళ్లు అస్లాం ఖాన్, ఎహ్సాన్ ఖాన్ కరోనా కారణంగా గతేడాది మరణించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతోన్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం సీనియర్ డాక్టర్లు.. కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పుల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్‌కర్ పర్యవేక్షణలో ఉన్నారు.
గత నెలలోనూ ఆయన సాధారణ పరీక్షల కోసం దవాఖానలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. కాగా 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే