గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (14:12 IST)

ఏపీ సర్కార్ మరో రికార్డు.. 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రి నిర్మాణం

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏపీ సర్కార్ మరో రికార్డు సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీలో 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రిని నిర్మించింది. ఈ ఆస్పత్రిని వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో జర్మన్ హ్యాంగర్ విధానంలో యుద్ధప్రతిపాదికన ఆస్పత్రి నిర్మాణం జరిగింది. 
 
5కోట్ల 50 లక్షల వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రిలో కోవిడ్ హాస్పిటల్ నిర్మించారు. స్టీల్ ఫ్యాక్టరీ నుంచి పైప్‌లైన్ ద్వారా నేరుగా ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు.  రాయలసీమకు చెందిన కరోనా రోగులకు ఈ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. 
 
అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రిలో కోవిడ్ హాస్పిటల్‌ను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆక్సిజన్ ఆధారంగా నిర్మించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి.