బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 జూన్ 2021 (20:43 IST)

భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ జెనీను విడుదల చేసిన ఇన్నోవిటి

తెలివైన చెల్లింపు పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఇన్నోవిటి నేడు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణాలోని స్థానిక మొబైల్‌ డీలర్ల కోసం భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ జెనీ (G.E.N.I.E)ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా కోవిడ్‌–19 మహమ్మారి వేళ ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ డీలర్‌ కమ్యూనిటీకి  ప్రయోజనం కలిగిస్తూ ఆన్‌లైన్‌ కస్టమర్లు మరలా రిటైల్‌ షాప్స్‌కు వచ్చే రీతిలో జెనీని తీర్చిదిద్దారు.
 
కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి మారిపోయారు. ఇది స్థానిక మొబైల్‌ మరియు కన్స్యూమర్‌ డ్యూరబల్‌ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. జెనీతో ఇప్పుడు వ్యాపారులకు అమ్మకాలను వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా మరింతగా షాప్‌లలోకి వినియోగదారులు వచ్చేలా చేయడం, మరిన్ని మార్పులను ప్రోత్సహించడం, మరిన్ని లాభాలను వారికి అందించడాన్ని ఇన్నోవిటీ లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో అందుబాటులో ఈఎంఐ పథకాలనూ అందించడం ద్వారా వినియోగదారులకు సహాయపడుతుంది.
 
ఈ ప్రభావంతో పోరాడే రీతిలో స్థానిక మొబైల్‌ డీలర్లకు మూడు ప్రయోజనాలను జెనీ అందిస్తుంది.
1) ప్రతి బ్రాండెడ్‌ మొబైల్‌ ఫోన్స్‌ విక్రయంపై అదనంగా 0.5% నుంచి 1%మార్జిన్‌ అందిస్తుంది. ఇది లాభాలను వృద్ధి చేసుకోవడం సహాయపడుతుంది.
 
2) జెనీ ఈఎంఐ వాలెట్‌ను వారికి అందిస్తుంది. దీనిద్వారా వారు ఎలాంటి ఉత్పత్తిపై అయినా జీరో కాస్ట్‌ ఈఎంఐను వినియోగదారులకు అందించవచ్చు. ఇది మరింతగా అమ్మకాలు వృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది.
 
3) 110కు పైగా బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై ఇన్‌స్టెంట్‌ జెనీ డిస్కౌట్‌ కూపన్లను ఇది అందిస్తుంది. తద్వారా మరింత మంది వినియోగదారులను ఆకర్షించడంతో పాటుగా వాకిన్స్‌ కూడా పెంచుకోవచ్చు.
 
ఫిబ్రవరి 2021లో బెంగళూరు, మైసూరులలో జెనీని ఇన్నోవిటీ  ఆవిష్కరించింది. అక్కడ ఈ ఉత్పత్తి వినియోగం ద్వారా సరాసరి నెలవారీ అమ్మకాలు 23% వృద్ధి చెందాయి. ఈ మార్కెట్‌లలో అత్యున్నత విలువ కలిగిన ప్రధాన స్రవంతి మొబైల్‌ వ్యాపారుల వద్ద 55% మార్కెట్‌ వాటాను ఇప్పటికూ ఈ ఉత్పత్తి పొందింది. కోవిడ్‌ లాక్‌డౌన్స్‌ తరువాత మార్కెట్‌లు తెరుచుకోవడంతో ఈ వాటా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ప్రధాన స్రవంతి మొబైల్‌ రిటైలర్లులో 12% మంది ఇప్పటికే  జెనీ టర్మినల్స్‌ కోసం ముందస్తుగా నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 2021 నాటికి ఈ మార్కెట్‌లలో సమున్నత మార్కెట్‌ వాటా పొందుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో  జెనీని మరింతగా విస్తరించడంతో పాటుగా అనంతర కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇన్నోవిటి కట్టుబడి ఉంది. సెప్టెంబర్‌ 2021 నాటికి ఒక లక్ష మొబైల్‌ డీలర్లకు ఇది చేరుకోనుంది.
 
ఇన్నోవిటీ పేమెంట్‌ సొల్యూషన్స్‌ సీబీఓ శ్రీమతి అమృత మాలిక్‌ మాట్లాడుతూ, ‘‘స్థానిక మొబైల్‌ డీలర్లు , వినియోగదారులకు  వారు ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు ఎంచుకునే సమయంలో స్పర్శ, అనుభూతి, నమ్మకాన్ని అందిస్తుంటారు. వారు వినియోగదారుల కు అవగాహన కల్పించడం మాత్రమే కాదు మార్గనిర్దేశనమూ చేస్తారు.
 
అయితే, చివరకు ఈ వినియోగదారులు ఆన్‌లైన్‌ వైపు మళ్లడంతో నష్టపోతుంటారు. కారణమేమిటంటే, ఆన్‌లైన్‌లో అత్యుత్తమ అవకాశాలు వారికి లభిస్తుండటం. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని  స్థానిక మొబైల్‌ డీలర్లకు తగిన శక్తిని అందించే రీతిలో అందుబాటులోని ఆఫర్ల కన్నా మెరుగైన ఆఫర్లను అందించడం కోసం బ్యాంకులు, బ్రాండ్లతో భాగస్వామ్యం చేసుకున్నాం. అత్యుత్తమ సాంకేతిక వినియోగం ద్వారా ఎస్‌ఎంబీలు తమ అదృష్టాన్ని పునరుద్ధరించుకోవడంలో జెనీ సహాయపడగలదని మేము నమ్ముతున్నాం’’ అని అన్నారు.
 
ఇన్నోవిటీ 10 బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లింపులను ప్రాసెస్‌ చేయడంతో పాటుగా ఎంటర్‌ప్రైజ్‌ మర్చంట్‌ విభాగంలో 76%కు పైగా మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. ఇప్పుడు మేము డిజిటల్‌ సాంకేతికత ప్రయోజనాలను ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి ఎస్‌ఎంబీలకు తీసుకురావాలనుకుంటున్నాం. తద్వారా మరింత ఉత్తమంగా పోటీపడేందుకు అనుకూలమైన వాతావరణం అందించడంతో పాటుగా వేగంగా వృద్ధి చెందేందుకు తగిన అవకాశాలనూ అందిస్తున్నాం. ఇన్నోవిటీకి యుఎస్‌కు చెందిన బెస్సీమర్‌ వెంచర్‌ పార్టనర్స్‌, ఎఫ్‌ఎంఓ, నెదర్లాండ్స్‌ మరియు కాటమరాన్‌, ఇండియా వంటి భారీ మదుపరులు మద్దతునందిస్తున్నారు.