బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (21:05 IST)

జర్నలిస్టు రఘు విడుదల.. పోరాటం ఆపేది లేదంటూ కామెంట్

Raghu
సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి.. ఆక్రమణల్ని బయటపెట్టడంతో అతనిపై తప్పుడు కేసులు పెట్టి లోపల వేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.

అయితే గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించేలా వ్యవహరించమే కాకుండా పోలీసులపై దాడులకు కారణమయ్యాడని ర‌ఘుపై కేసులు నమోదు నమోదు కాగా.. మిర్యాల‌గూడ కోర్టు సోమవారం నాడు ర‌ఘుకు బెయిల్ మంజూరు చేసింది. 30వేల రూపాయ‌ల పూచీక‌త్తు పై కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మంగళవారం న‌ల్గొండ జైలు నుండి యాంకర్ ర‌ఘు విడుద‌లయ్యారు.
 
అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం జర్నలిస్ట్ రఘు వెనక్కి తగ్గేదేలేదని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు సహకరించిన మీడియా వారికి.. మిత్రులకు.. రాజకీయ పార్టీలకు.. సోషల్ మీడియా సపోర్టర్స్‌కి ధన్యవాదాలు. గౌరవ న్యాయ స్థానం నాకు బెయిల్ ఇచ్చింది.. ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా.. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జనం సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జర్నలిస్ట్‌లు ఉంటారు. 
 
తెలంగాణ జర్నలిస్ట్‌లు తెలంగాణ ఉద్యమం కోసం ఏవిధంగా పనిచేశారో అందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ప్రశ్నించకపోతే.. ప్రశ్నించడం కొనసాగకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ ప్రశ్నించడాన్ని ఆపను’ అని అన్నారు.