శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (13:55 IST)

సీఎం కేసీఆర్ జైలుకుపోక తప్పదు : బండి సంజయ్

తెలంగాణా సీఎం కేసీఆర్‌ ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని ఆ రాష్ట్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. కేసీఆర్‌తోపాటు... తెరాస నేతల అవినీతిపై ఆయన స్పందిస్తూ, అవినీతికి బీజేపీ పూర్తి వ్యతిరేకమన్నారు. 18 మంది తెరాస ముఖ్య నేతల అవినీతి వివరాలను సేకరించామన్నారు. 
 
వారికి గురించి ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని తెలిపారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి కూడా వివరాలను  సేకరించినట్టు చెప్పారు. కేసీఆర్ కేసుల గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామన్నారు. ఈ కుంభకోణాల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత కేసీఆర్ ఎంత అవినీతిపరుడో తెలిసిందన్నారు. 
 
అందువల్ల కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు పట్టించుకోబోమని అన్నారు. ఇకపోతే, తెరాస సీనియర్ నేత ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరుతారని సంజయ్ తెలిపారు. 
 
ఎలాంటి హామీలు లేకుండానే ఆయన బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన నచ్చే ఆయన బీజేపీలో చేరుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి బీజేపీ మంచి వేదిక అని చెప్పారు. కేసీఆర్‌ను వ్యతిరేకించేవారి తరపున బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్ ప్రకటించారు.