దేశంలో గత 24 గంటల్లో 60,753 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం... శుక్రవారం 97,743 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు....