గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (14:25 IST)

రోడ్డు ప్రమాదంలో జాతీయ ఉత్తమ నటుడు దుర్మరణం

జాతీయ ఉత్తమ నటుడు ఒకరు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన పేరు సంచారి విజయ్. ఈయనకు 38 యేళ్లు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలై కాసేటి క్రితమే కన్నుమూశారు. 
 
జూన్‌ 12 రాత్రి విజయ్‌ తన స్నేహితుడిని కలిసిన అనంతరం మోటార్ బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయ్‌ తల, కాలికి బలమైన గాయాలు తగిలాయి.
 
ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇలాంటి విషాద వార్తను చెప్పడానికి మాట రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
 
కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంచారి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది. 
Sanchari vijay
 
విజయ్‌ 2011లో విడుదలైన 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. విజయ్. ఈయన చివరిసారిగా 'యాక్ట్‌ 1978' చిత్రంలో నటించారు.