ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (13:47 IST)

కరోనా వైరస్ సోకి రాంగోపాల్ వర్మ కజిన్ సోదరుడు మృతి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి వర్మ సోదరుడు (కజిన్) కన్నుమూశారు. ఆయన పేరు పి. సోమశేఖర్. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 
 
కాగా, సోమశేఖర్ గత 2010లో మస్క్‌రకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే, సత్య, రంగీల, దౌడ్, జంగిల్, కంపెనీ వంటి చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. తన ఎదుగుదలలో సోమశేఖర్ ఎంతగానో సహాయం చేశారంటూ రాంగోపాల్ వర్మ పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, సోమశేఖర్ మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.