మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (12:33 IST)

ఓటీటీ బిజినెస్‌లోకి రామ్ గోపాల్ వర్మ.. శుభాకాంక్షల వెల్లువ

కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూసుకుపోయాయి. అయితే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చాలానే వచ్చాయి. ఆహా, అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్ లాంటివి వరుసబెట్టి సినిమాలను విడుదల చేస్తూ దూసుకుపోతున్నాయి.
 
ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మసైతం ఓటీటీ బిజినెస్ వైపు అడుగులేస్తున్నాడు. ఈ మేరకు స్పార్క్ ఓటీటీ అనే సంస్థను తీసుకొస్తున్నాడు. మే 15నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన డీ కంపెనీ సినిమాతోనే దీని సేవలు స్టార్ట్ అవుతాయి.
 
ఇక ఆయనకు పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఛార్మీ, పూరి జగన్నాథ్‌, రాజమౌళి, ప్రభాస్‌, బ్రహ్మానందంలాంటి వాళ్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. రామ్‌గోపాల్ వర్మకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి ఒక్కరూ స్పార్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ కోరాడు.