మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (21:34 IST)

కుంచకో బోబన్‌-నయన సినిమా విడుదలకు సిద్ధం

అందాల తార నయనతార మలయాళ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. దక్షిణాది లేడి సూపర్ స్టార్‌గా నయనతార ఓ వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్నాత్తే, కాతువాకుల రెండు కాదల్ చిత్రాల్లో నటిస్తోంది.

నయనతార మలయాళంలో కూడా నిజల్ సినిమా చేస్తోంది. కుంచకో బోబన్‌కు జోడీగా నయన్ నటిస్తోంది. సైజ్ కురుప్‌, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ కీ రోల్స్ పోషించారు.
 
మే 9న 4K & Dolby ఓటీటీ సంస్థ ద్వారా ఈ మూవీ విడుదల కాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించాడు.

ఇప్పటివరకు తెలుగు, తమిళంలో అలరించిన నయన్ ఇపుడు మలయాళంలో కూడా సక్సెస్ సాధించాలని అందరూ విష్ చేస్తున్నారు.