మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (09:52 IST)

నయనతారకు, విఘ్నేశ్ శివన్‌కు ఎంగేజ్మెంట్ అయిపోయిందా..?!

Nayanthara
దక్షిణాది సూపర్ స్టార్ నయనతారకు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందనే ప్రచారం సాగుతోంది. నయనతార కొత్త బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో యాక్టివ్ వుంటారనే విషయం తెలిసిందే. అతను తరచూ అభిమానుల కోసం తన గర్ల్ ఫ్రెండ్ నయనతారతో ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ఆయన నయనతార తన ఉంగరాన్ని చూపిస్తూ తన గుండెల మీద చేయి వేసిన ఉన్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు.
 
ఈ ఫోటోను షేర్ చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విఘ్నేష్ శివన్, నయనతార నిశ్చితార్థం జరిగిందా అని అభిమానులు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు. విగ్నేష్ శివన్ ఫోటోను షేర్ చేస్తూ తమిళ్‌లో ఒక ఫేమస్ పాట యొక్క సాహిత్యాన్ని కామెంట్‌గా ఉపయోగించారు. దీంతో వీరి ఎంగేజ్మెంట్ అయిపోయిందని ప్రచారం మొదలైంది.