మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శుక్రవారం మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదట!

శుక్రవారం పొద్దు పోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదు. మంగళవారం కూడా వాటిని ఇవ్వకూడదు. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు కాబట్టి. అలాగే సాయంత్రం పూట ఆరు గంటల దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. 
 
అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శుక్రవారం ఒక కుంది దీపం పెట్టే వాళ్లు 3 ఒత్తులు వేయాలి. రెండు అంత కంటే ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది. పూజ చేసే విగ్రహాల ముందు సాయంత్రం కచ్చితంగా మంచినీరు వుంచాలి.
 
సంధ్య కాలంలో సంసారం నిషేధం, నిద్రపోకూడదు. ఆహారం తీసుకోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోష కాలం, ధ్యానం పూజ, మంచి ఫలితం ఇస్తుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చేతిని కడిగేసి అక్కడే కూర్చుంటే రోగం వస్తుందంటారు. 
 
నిద్ర లేచిన వెంటనే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ సమయంలో వాకిలి చిమ్ముకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.