గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శుక్రవారాల్లో బ్రహ్మ ముహూర్త కాలంలో దీపం వెలిగిస్తే..?

శుక్రవారాల్లో బ్రహ్మ ముహూర్త కాలంలో దీపం వెలిగించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. బ్రహ్మముహూర్తం అనేది అర్థరాత్రి దాటాక ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల్లోపు ప్రాంతం. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి.. దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. బ్రహ్మ ముహూర్త కాలంలో దీపారాధన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
బ్రహ్మ ముహూర్తంలో ఏ విధంగా పూజ చేయాలంటే...? మూడు గంటల ప్రాంతంలో దీపారాధన చేసే మహిళలు శుచిగా స్నానమాచరించి.. నుదుట తిలకం ధరించాలి. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిలో బియ్యంపిండితో ముగ్గులు పెట్టాలి. ఆపై దీపం వెలిగించాలి. ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన ద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. రాహు-కేతు, కళత్ర దోషాలు వుండవు. బ్రహ్మ ముహూర్తకాలంలో దీపారాధన చేస్తే దేవతలు, దేవరులు, శివకేశవులు, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వ్యాపారాన్ని ఆరంభించడం, గణపతి హోమం, గృహ ప్రవేశం, వివాహం వంటి అన్నీ శుభకార్యాలు బ్రహ్మ ముహూర్తంలో జరిగితే విశేష ఫలితాలు ఖాయం.