బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:43 IST)

వాలంటైన్స్‌ డే స్పెషల్.. నయనతో విక్కీ ఫోటో వైరల్.. నీతో ప్రేమలో ఉండటాన్ని..?

nayanatara_vignesh
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ప్రేమలో వున్నారు. ఇక నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్‌ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. 
 
ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కోలీవుడ్‌ లవ్‌ కపుల్స్‌గా మంచి పేరున్న విఘ్నేష్‌ శివన్, నయనతార ప్రతీ సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఆ సందడిని సోషల్‌ మీడియాలో పంచుకుంటారు.
 
అలా వాలంటైన్స్‌ డే సందర్భంగా ఈ ప్రేమజంట తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ''నీతో ప్రేమలో ఉండటాన్ని ఎంతో ప్రేమిస్తుంటాను" అని ఈ ఫోటోకు విఘ్నేశ్ క్యాప్షన్‌ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్‌ దర్శకత్వంలో ‘కాదువాక్కుల్‌ రెండు కాదల్‌’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది నయనతార.