శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (20:07 IST)

ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు.. భార్య క్రెడిట్ కార్డుతో ఆ పని చేశాడు..?

ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు అన్నట్లుగా.. ఇంట్లో భార్య, ఆఫీసులో మరో యువతితో ప్రేమాయణం కొనసాగించాడు.. ఓ యువకుడు. అంతటితో ఆగకుండా భార్య డబ్బులతో గర్ల్‌ఫ్రెండ్‌ చేసిన తప్పును పూడ్చాడు. ఆ అమ్మాయి కారు చలాన్లు కట్టి అడ్డంగా బుక్కయ్యాడు. చేసిన పాపానికి ప్రతిఫలం ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చింది. సెల్‌ఫోన్‌కి వచ్చిన మెసెజ్ చూసి అతని భార్య ఒక్కసారిగా షాక్ అయింది. 
 
'మీ క్రెడిట్‌ కార్డుతో ట్రాఫిక్‌ చలాన్లు చేల్లించనందుకు ధన్యవాదాలు' అని వచ్చిన సందేశంతో అవాక్కైంది. దీంతో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ చెక్ చేసుకుంది. అందులో కార్డు లేదు. తన ఎక్కడైనా పోయిందెమో అని బయపడింది. వెంటనే సంబంధిత బ్యాంక్ కెర్‌కు ఫోన్ చేసి కార్డును బ్లాక్‌ చేయించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయాన్ని వాళ్ళు తేల్చారు. 
 
ఫైన్ కట్టిన కార్డు నెంబర్ అధారంగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు పోలీసులు. మరొక్కరి కార్డుతో చలనా ఎలా కట్టావని అని నిలదీశారు. దీంతో ఆమె ఏమి ఆలోంచకుండా నా బోయ్‌ఫ్రెండ్‌ కట్టేశాడని చెప్పేసింది. లోతుగా విచారణ జరిపెందుకు ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లారు. దీంతో కథ అంతా బయటపడింది. తన బాయ్‌ ఫ్రెండ్‌కు పెళ్ళైందని తెలియడంతో గర్ల్ ఫ్రెండ్ షాకైంది. తన భార్య కార్డుతోనే కారు చలానా చెల్లించాడని అర్థమై షాక్ తింది. 
 
ఈ ఘటన దుబాయ్ నగరంలో చోటుచేసుకుంది. ఇలాంటి కేసును ఛేదించడం ఇదే మెుదటిసారని దుబాయ్‌ సైబర్‌ క్రైం డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కెప్టెన్‌ అబ్దుల్లా ఆల్‌ షాహీ తెలిపారు.