ప్రియురాలు పిలిచె దోసె కోసం, అన్నదమ్ములతో కలిసి భార్య భరతం

ఐవీఆర్| Last Modified శనివారం, 23 జనవరి 2021 (17:13 IST)
ఈమధ్య కాలంలో వివాహేతర సంబంధాల్లో ఇరుక్కునే మగవారి సంఖ్య పెరుగుతోంది. కట్టుకున్న భార్యను కాదని వేరే కుంపటి పెడుతున్నారు. అటు ప్రియురాలి కుటుంబంతో పాటు ఇతడి కుటుంబాన్ని కూడా వీధిపాలు చేస్తున్నారు.

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భర్తను అతడి తన అన్నదమ్ములతో కలిసి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక బాదింది. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు లాక్కెళ్లింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బందాలో ప్రభుత్వ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. మొదట ఇంట్లో భోజనం చేయడం మానేసి ప్రియురాలితో తినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఉదయాన అల్పాహారం కూడా ఇంట్లో తనకుండా ఉదయాన్నే ట్రిమ్ముగా రెడీ అయిపోయి ప్రియురాలి దగ్గర వాలేస్తున్నాడు. ఇద్దరూ కలిసి హాయిగా అల్పాహారం ఆరగించేస్తున్నారు.

తన వరసలో రోజురోజుకీ తేడా రావడంతో ఆ ఇల్లాలు నిఘా వేసింది. ఉదయాన్నే కారులో బయలుదేరిన భర్తను అనుసరించింది. ఆ కారు ఓ హోటల్ ముందు ఆగి వుండటాన్ని గమనించింది. కారు లోపల ప్రియురాలితో కలిసి అతడు దోసె తింటూ వుండటాన్ని చూసి తన అన్నదమ్ములకు సమాచారం అందించింది. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం చేస్తున్న భర్తపై దాడి చేసింది ఆ ఇల్లాలు. ఆ తర్వాత అతడిని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారట.దీనిపై మరింత చదవండి :