శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (13:25 IST)

చిక్కుల్లో పడిన రిషబ్ పంత్.. అభిమానిని హగ్ చేసుకుని..?

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు కారణంగా ఓ అభిమానిని హగ్ చేసుకోవడమే. క్రికెట్‌ ఆస్ట్రేలియా బయో బుబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాడని రిషబ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్‌లో రోహిత్, గిల్‌, సైనీలతో కలిసి పంత్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వీళ్ల బిల్లును ఓ అభిమాని చెల్లించాడు. ఆ సందర్భంలోనే పంత్ అతడిని హగ్ చేసుకున్నాడు. 
 
అతడు చెల్లించిన డబ్బును తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుతూ.. పంత్ ఇలా హగ్ చేసుకోవడం విశేషం. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా బయో బబుల్ నిబంధనల ప్రకారం ఇలా చేయడం ప్రొటోకాల్ ఉల్లంఘన కిందికే వస్తుంది. క్రికెటర్లు బయటకు వెళ్లవచ్చు, రెస్టారెంట్లలో తినవచ్చు కానీ ఇలా బబుల్‌లో లేని వ్యక్తిని తాకడంపై నిషేధం ఉంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాతోపాటు బీసీసీఐ కూడా విచారణ జరపనున్నాయి.
 
బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘనలను ఆయా క్రికెట్ బోర్డులు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన క్రికెటర్లను సస్పెండ్ చేయడమో, జరిమానా విధించడమో చేశాయి. మరి రిషబ్ సంగతి ఏమౌతుందో వేచి చూడాలి.