గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (19:08 IST)

ధోనీకి వారసుడు ఎవరు..? ఆ స్థానాన్ని అతడు భర్తీ చేయగలడా? (video)

ధోనీకి వారసుడు ఎవరు..? ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నం అవుతూ వుంది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 
 
ఇక, 350 వన్డేలు, 90 టెస్టులు, 90 టీ-20లు మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ధోని స్థానాన్ని ఫర్‌ఫెక్ట్‌గా భర్తీ చేయగలడని కొందరు మాజీ క్రికెటర్లు నమ్ముతున్నారు. 
 
తాజాగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ప్రారంభించిన విధానం చాలా బాగుందన్నారు. లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్‌గా రాణిస్తున్న పంత్.. టీమిండియా మిడిల్ ఆర్డర్‌ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిగా సరిపోతాడని అన్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
 
సంజయ్ బంగార్ చెప్పిన అంశాన్ని మాజీ ఇండియా పేసర్ ఆశిష్ నెహ్రా కూడా సమర్ధించారు. టీమిండియా తరఫున 13 టెస్ట్‌లు, 16 వన్డేలు, 28 టీ-20లు ఆడిన పంత్‌ను పలువురు ధోని వారసుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే టీమిండియా తరఫున నిలకడగా రాణించడంలో పంత్ విఫలమవుతున్నాడు.