సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:12 IST)

40 ఏళ్ల వయస్సుల్లోనూ ఫిట్‌గా ధోనీ.. డైవ్ చేసి క్యాచ్.. వైరల్ (video)

dhoni - csk
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో ధోనీ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆయ కెప్టెన్సీ వహిస్తున్నాడు. నాలుగు పదుల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేనని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించి ధోనీ అందరికీ షాకిచ్చాడు. ఇక ఐపీఎల్ 2020లో చెన్నై తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ రెండో మ్యాచ్‌లో ధోనీ తీసుకున్న నిర్ణయాలు జట్టును రాజస్థాన్ చేతిలో పరాజయం పాలయ్యేలా చేసిందని విమర్శలు వస్తున్నాయి. 
 
అయినా ఎప్పటికప్పుడు విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతున్నాడు  40 ఏళ్ల వయసులో కూడా మైదానంలో చురుగ్గా కదులుతూ తన ఆటతీరుపై కామెంట్ చేసే విమర్శకులకు ధీటైన సమాధానం ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్ మాత్రం కొనసాగనున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్.. ధోని అతని ఆట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
 
అలాంటి అభిమానుల్లో శుక్రవారం మైదానంలో పట్టిన క్యాచ్ విపరీతమైన జోష్ నింపిది. సామ్ కరణ్ వేసి బంతిని.. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్లిప్‌లో నుంచి బౌండరీకి తరలించేందుకు చూశాడు. దాన్ని అద్భుతమైన టైమింగ్‌లో ధోని డైవ్ చేసి అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం ధోని పట్టిన క్యాచ్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఐపీఎల్ వెబ్‌సైట్‌లో కూడా పోస్ట్ చేరు. "దానికి ఇది పక్షినా?, విమానామా?.. కాదు.. అది ఎంఎస్ ధోని" అని పేర్కొన్నారు. 
dhoni
 
మరికొందరు నెటిజన్లు ఎగిరే మహేంద్రుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్విటర్‌లో ధోని క్యాచ్‌ను షేర్ చేసింది. దట్ క్యాచ్ అని పేర్కొంది. ఇక, ఈ మ్యాచ్‌ మాత్రం చెన్నై ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది.