గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (18:34 IST)

''2 స్టేట్స్''తో అడవిశేష్‌కు చిక్కులు.. శివానీ రాజశేఖర్ సినిమా అంతేనా?

Adivi Sesh
టాలీవుడ్ నటుడు అడవిశేష్‌ గతంలో '2 స్టేట్స్' సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన కొంతభాగం షూటింగ్‌ పూర్తయింది. అయితే ఈ ప్రాజెక్టుకు చిక్కులు వచ్చినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 
 
2స్టేట్స్ నిర్మాత, లక్ష్య ప్రొడక్షన్స్ అధినేత ఎంఎల్‌వీ సత్యనారాయణ ఈ సినిమాకు సంబంధించి అడవిశేష్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే కొన్ని సృజనాత్మక విభేధాల కారణంగా అడివి శేష్ ఈ సినిమాను పక్కనపెట్టి మేజర్ మూవీ షూటింగ్‌తో బిజీ అయ్యాడు.
 
ప్రస్తుతం అడివి శేష్ కు ఈ సినిమాపై ఆసక్తిలేకపోవడంతో వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. దీంతో తన సినిమాకు సంబంధించి లీగల్ రూట్‌లో వెళ్లాలని అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవేళ లీగల్ రూట్‌లో వెళ్తే నిర్మాతకే ఎక్కువగా మేలు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 
 
వెంకట్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రాజెక్టు 2 స్టేట్స్‌కు తెలుగు రీమేక్‌. శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటించింది. మరి 2స్టేట్స్ తెరపైకి వస్తుందా..? లేదా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.