మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:30 IST)

మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీబీఎంకు కరోనా ఫీవర్.. మేజర్ టీమ్ మొత్తం..?

కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీని చిక్కులు పెడుతోంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన ఎందో నటీనటులు, దర్శకనిర్మాతలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారమంగా సినిమాలు ఆగిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా ఆగింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయినా జీబీఎం ఎంటర్టైన్మెంట్‌లో పలువురికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ చిత్రం ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత టీం మెంబర్స్ అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, సగం మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సమాచారం. 
 
దీంతో 'మేజర్' చిత్రబృందం మొత్తం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2008 నవంబర్ ముంబై ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.