సంబంధిత వార్తలు
- శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం... 9 మంది గల్లంతు
- ఎస్పీబీ కోసం సంగీతప్రియులు సామూహిక ప్రార్థనలు, కన్నీటితో ఎస్పీ చరణ్, నాన్న ఆరోగ్యం గురించి
- బాధ్యత ఉండక్కర్లేదా? లేఖలు రాసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?
- టిటిడిలో కరోనా విజృంభణ, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో తెలిస్తే..?
- కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా
తెలంగాణాలో కరోనా పరుగు - లక్ష కేసులకు చేరువలో... దేశంలోనూ అంతే...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదేసమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు.
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. అలాగే, 76,967 మంది డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,48,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇకపోతే, దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.
