1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Doctor Suspended for Surgical Blunder in Andhra Pradesh

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

Doctors
ఏపీలోని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వైద్యులు తన విధుల్లో నిర్లక్ష్యం వహించారు. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన ఆ వైద్యుడు సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదిలేశాడు. ఆ తర్వాత బాధిత మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా డాక్టర్ టి.నారాయణ స్వామి పనిచేస్తున్నారు. ఆయన నవంబరు నెల 26వ తేదీన ఓ మహిళకు క్యాబెక్టమీ ఆపరేష్ చేశారు. ఆపరేషన్ సమయంలో సర్జికల్ బ్లేడును ఆ మహిళ కడుపులోనే వదిలేశారు. ఆ తర్వాత ఆ మహిళకు కడుపునొప్పి రావడంతో వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బయటపడింది. 
 
ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, ప్రాథమిక విచారణ నివేదికలో వైద్యడు నిర్లక్ష్యం స్పష్టంగా తేలింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాధ్యుడైన వైద్యుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆరోపించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన ఉన్నతాధికారులు డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??