బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (22:11 IST)

ఒకే సినిమాలో నయనతార, సమంత.. విజయ్ సేతుపతి ఏం చేస్తాడో?

Samantha_Nayana
మల్టీస్టారర్ సినిమాలో సమంత కనిపించనుంది. కోలీవుడ్ డైరక్టర్, నయనతార ప్రేమికుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తోన్న తమిళ చిత్రం ''కాతువాకుల రెండు కాదల్‌. ఇది మల్టీస్టారర్‌గా వస్తోంది ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్లు సమంత, నయనతార ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందే లాంఛ్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. 
 
తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ కొనసాగించనున్నారట మేకర్స్. అంతేకాదు డిసెంబర్ 14న సమంత షూటింగ్‌లో జాయిన్ కానున్నట్టు టాక్.
 
కాగా.. శర్వానంద్‌తో కలిసి జాను చిత్రంతో నటించిన సమంత ఆ తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఆహా టాక్ షో..సామ్ జామ్ షూట్‌తో బిజీగా ఉంది. మళ్లీ చాలా రోజుల తర్వాత సినిమా కోసం మేకప్ వేసుకుంటుంది సామ్‌. ఈ సినిమా తప్పకుండా సమంతకు మంచి పేరు సంపాదించి పెడుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.