మాస్టర్ టీజర్ అదుర్స్.. వారం గ్యాప్‌లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ (video)

Master Teaser
సెల్వి| Last Updated: శుక్రవారం, 27 నవంబరు 2020 (20:07 IST)
Teaser
తమిళ స్టార్ హీరో విజయ్‌కి భారీ క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్టర్ సినిమా రిలీజ్ కాకముందే పలు రికార్డ్‌లను సృష్టిస్తోంది. తాజాగా విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా టీజర్ రికార్డులన్నింటిని బ్రేక్ చేసి యూట్యూబ్‌లో హల్ చల్ సృష్టిస్తోంది.

వ్యూస్, లైక్స్ విషయంలో తమిళ ఆడియన్స్ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేశారు. వారం గ్యాప్ లోనే ఏకంగా 40 మిలియన్‌ల వ్యూస్‌ను మాస్టర్ చిత్రం టీజర్ దక్కించుకుంది.

ఇక లైక్స్ విషయంలో కూడా గత రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసింది మాస్టర్ టీజర్. దాదాపుగా 2.5 మిలియన్ లైక్స్‌తో సౌత్‌లోనే టాప్‌లో నిలిచింది. మాస్టర్ సినిమాపై విజయ్ అభిమానుల్లో అంచనాలకు ఇది ఒక నిదర్శనంగా నిలిచింది.

సూపర్ స్టార్ విజయ్‌తో విలక్షణ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన మాస్టర్ సినిమాకు ఇంత క్రేజ్ ఉండటంతో ఆ చిత్ర మేకర్స్ కూడా షాకవుతున్నారు. కొత్త దర్శకుడితో విజయ్ చేసిన సినిమాకు ఎందుకు ఇంత హైప్ అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

దీనిపై మరింత చదవండి :