శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (15:10 IST)

సిస్టర్... నీ బలానికి.. పట్టుదలకు సెల్యూట్... నయనకు బర్త్‌డే విషెస్

మలయాళ కుట్టి నయనతార తన 36వ పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. ఆమె ఈ వేడుకలను తన ప్రియుడు, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి జరుపుకుంటున్నారు. 
 
ఇటీవల తన ప్రియుడు పుట్టినరోజు కోసం నయనతార ఏకంగా రూ.25లక్షల మేరకు ఖర్చు చేసింది. ఈ వేడుకలను జరుపుకునేందుకు ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో తన ప్రియుడుతో కలిసి గోవాకు వెళ్లింది. ఇపుడు నయనతార వంతు వచ్చింది. తన ప్రియుడు విఘ్నేష్ కూడా ఇదే విధంగా తన ప్రియురాలి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత కూడా నయన్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. 'ఒకే ఒక నయనతారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్' అంటూ కామెంట్ చేసింది. నయన్, సమంత ఓ తమిళ సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.