సంబంధిత వార్తలు
- మయన్మార్‌లో హింసాత్మక ఘర్షణలు.. 43 మంది చిన్నారులు మృతి
- సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ బాంబుల వర్షం... 50 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు హతం
- వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. ఇండియాకో, అమెరికాకో వెళ్లిపోండి..?
- అకౌంట్ చెక్ చేస్తే కోట్లు కనిపించాయ్.. ఆమె ఖాతాలోకి 74 వేల కోట్లు.. ఎలా..?
- భర్త వద్ద వధువు వింత కోరిక.. శోభనాన్ని షూట్ చేయాలి.. ఫోటోగ్రాఫర్స్‌ను కూడా..?
టొగొగా మార్కెట్‌పై వైమానికి దాడులు... 80 మంది మృత్యువాత
ఇథియోపియా దేశంలోని ఉత్తర డిగ్రే ప్రాంతంలోని టొగొగాలో ఓ మార్కెట్‌పై వైమానికి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది మృతి మృత్యువాతపడ్డారు. వందలాదిమంది గాయపడ్డారు. వీరిలో పలువురు అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు.
గతేడాది నవంబరు నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వైమానిక దాడి జరిగింది. మార్కెట్‌పై విమానం నుంచి బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది.
ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
తర్వాతి కథనం
