బ్యాంకాంక్‌లో భారీ బుద్ధుడి విగ్రహం.. 2022లో ప్రారంభం
బ్యాంకాంక్‌లో భారీ బుద్ధుడి విగ్రహం దాదాపు పూర్తి అయ్యింది. 230 అడుగుల బుద్ధుడి విగ్రహ నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. ఈ బుద్ద విగ్రహం బ్యాంకాక్ నగరమంతా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో బంగారు రంగులో మెరిసిపోయే ఈ భారీ బుద్ధుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
అంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ బుద్ధుడి విగ్రహాన్ని. 20 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే ఈ విగ్రహ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించగా ఈనాటికి దాదాపు పూర్తి అయ్యింది. కరోనా మహమ్మారి కేసుల క్రమంలో ఈ విగ్రహం నిర్మాణం ఆలస్యమైంది.
లేదంటే ఈ ఏడాదిలోనే విగ్రహం ప్రారంభం జరిగి ఉండేది. ఈ విగ్రహం నిర్మించిన ఆలయానికి గతంలో పర్యాటకులు భారీగా వచ్చేవారు. కానీ కరోనా వల్ల విదేశీయుల రాక తగ్గింది. ఈక్రమంలో తిరిగి దేశ సరిహద్దులు తెరబడితే ఆలయానికి పర్యాటకులు భారీగా వస్తారని ఆలయ నిర్వహకులు భావిస్తున్నారు.
తాజాగా విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తి పూర్తి కావచ్చింది. ఈ ఏడాది చివరికి పూర్తి కావచ్చు. కానీ విగ్రహం ప్రారంభం మాత్రం 2022లో జరగొచ్చని బుద్ధ ఆలయ ప్రతనిథి పిసాన్ సంకాపినిజ్ తెలిపారు. బ్యాంకాక్ నగరం అంతా కనిపించేలా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ విగ్రహం నిర్మాణానికి 16 మిలియన్ల విరాళాలు సేకరించి వినియోగించామని తెలిపారు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం మాజీ మఠాధిపతి లుయాంగ్ పు సోద్ కాండసారో ఎంతగానే కృషి చేశారని.. ఆయను గన నివాళిగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
బ్యాంకాక్ శివార్లలోని రాయల్ వాట్ పక్నం ఫాసి చరోయెన్ ఆలయం 1610 నాటిది. ఈ ఆలయం చావో ఫ్రేయా నది నుండి ప్రవహించే కాలువల ద్వారా సృష్టించబడిన ద్వీపంలో ఉంది. ఈ దేవాలయంలోనే భారీ బుద్ధుడి విగ్రహం నిర్మాణం జరుగుతోంది. కమలంలో కూర్చున్నట్లుగా బుద్దుడి ప్రతిమ ఉంటుంది. రాగి,బంగారంతో కలిపి ఈ విగ్రహానికి పెయింట్ వేయటంతో బంగారురంగులో మెరిసిపోతోంది.