శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:21 IST)

2021లో 8 నూతన రెసిడెన్షియల్‌ ప్రోపర్టీలను ప్రారంభించనున్న అపర్ణ కన్‌స్ట్రక్షన్‌

దేశంలో సుప్రసిద్ధ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లలో ఒకటైన అపర్ణ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ఈ సంవత్సరంలో తాము 8 నూతన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రం నల్లగండ్ల వద్ద తమ లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీ అపర్ణ సరోవర్‌ జికాన్‌ను తమ 58వ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌గా ఆరంభించింది.
 
ఈ అపర్ణ సరోవర్‌ జికాన్‌తో పాటుగా హైదరాబాద్‌ నగరంలో మరో మూడు ప్రాజెక్ట్‌లను కంపెనీ ఆరంభించడంతో పాటుగా బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లను ఆరంభించనుంది. ఈ కంపెనీ రెండు ప్లాటెడ్‌ లేఔట్స్‌ను సైతం ఆరంభించనుంది. ఈ నూతన వెంచర్లతో అపర్ణ కన్‌స్ట్రక్షన్‌ మొక్క మొత్తం పోర్ట్‌ఫోలియో రెసిడెన్షియల్‌ విభాగంలో 64 ప్రాజెక్టులకు చేరనుంది.
 
నూతనంగా ఆరంభించిన అపర్ణ సరోవర్‌ జికాన్‌ను 25.6 ఎకరాలలో నిర్మించనున్నారు. దీనిలో 3024 వాస్తు ప్రమాణాలతో కూడిన అపార్ట్‌మెంట్లు 26 అంతస్తుల టవర్లలో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లో 2బీహెచ్‌కె, 3బీహెచ్‌కె, 4బీహెచ్‌కె లగ్జరీ అపార్ట్‌మెంట్లు 1240 చదరపు అడుగుల నుంచి 2765చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. దీనిలో 85వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌ కూడా ఉంటుంది. అపర్ణ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసిన అతిపెద్ద క్లబ్‌ హౌస్‌ ఇది. ఈ ప్రాజెక్టు 2024 సెప్టెంబర్‌ నాటికి పూర్తి కానుందని అంచనా.
 
కంపెనీ విస్తరణ ప్రణాళికలను గురించి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ శ్రీ రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘రియల్‌ ఎస్టేట్‌ రంగంపై మహమ్మారి, తదనంతర లాక్‌డౌన్స్‌ ప్రభావం చూపినప్పటికీ అపర్ణ కన్‌స్ట్రక్షన్‌ మాత్రం శక్తివంతమైన వృద్ధిని కనబరిచింది. మా నూతన ఆరంభాలు దీనికి నిదర్శనం. ఎనిమిది రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులతో పాటుగా ఈ సంవత్సరం దక్షిణాది మార్కెట్‌లో వాణిజ్య ఆవిష్కరణలనూ చేయనున్నాం. దీనిలో భాగంగా మరో 400 మందిని ఉద్యోగాలలోకి తీసుకోవాలని ప్రణాళిక చేశాం’’అని అన్నారు.