శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:08 IST)

బహిష్టుపై ఉన్న అపోహలను పారద్రోలేందుకు క్రైతో భాగస్వామ్యం చేసుకున్న ద బాడీ షాప్‌

అతి సహజమైన శరీర ప్రక్రియ బహిష్టు, అయినప్పటికీ ఎంతోమంది మహిళలు, బాలికలు ఇప్పటికీ దానిని వెల్లడించేందుకు సిగ్గుపడటంతో పాటుగా సరైన బహిష్టు ఆరోగ్యం పొందడంలోనూ సమస్యలెదుర్కొంటున్నారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఈ పరిస్థితులు మరింతగా దిగజారాయి.
 
ఈ క్రమంలో బ్రిటీష్‌ బ్రాండ్‌ ద బాడీ షాప్‌ ఇప్పుడు చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు(క్రై)తో భాగస్వామ్యం చేసుకుని బహిష్టు, పీరియడ్‌ షేమ్‌, భారతీయ బాలికలు, మహిళలపై పీరియడ్‌ షేమ్‌ పట్ల అవగాహన కల్పిస్తూనే అసలైన మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా, బాడీ షాప్‌ ఇప్పుడు పీరియడ్స్‌ చుట్టూ ఉన్న సంభాషణలను సాధారణంగా మార్చడంతో పాటుగా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన వారికి బహిష్టు ఆరోగ్యం కోసం నిధుల సమీకరణ సైతం చేయనుంది.
 
అంతేకాదు, క్రైతో భాగస్వామ్యంలో భాగంగా 4500కు పైగా గృహాలలో 10వేల మంది ప్రజలకు ఉచితంగా బహిష్టు ఉత్పత్తులు అందించడంతో పాటుగా బహిష్టు ఆరోగ్యం పట్ల అవగాహన సైతం కల్పించడాన్ని ద బాడీ షాప్‌ లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ సందర్భంగా ద బాడీ షాప్‌ ఇండియా సీఈవో శృతి మల్హొత్రా మాట్లాడుతూ, ‘‘వాస్తవ ప్రపంచపు సమస్యలే మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంటాయి. మనదేశంలో బహిష్టుకు సంబంధించిన గణాంకాలు ఇంకా భయానకంగానే ఉన్నాయి. కరోనా మహమ్మారి పరిస్థితిని మరింతగా దిగజార్చింది. సిగ్గుపడని రీతిలో బహిష్టులు, సురక్షిత నెలసరి ఉత్పత్తులు మరియు ఖచ్చితమైన బహిష్టు విద్య అనేవి కేవలం మహిళలకు సంబంధించిన అంశాలు కాదు, అవి మానవ సంబంధిత అంశాలు’’ అని అన్నారు.
 
ద బాడీ షాప్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌ శ్రద్ధా కపూర్‌ మాట్లాడుతూ, ‘‘నా హృదయానికి దగ్గరగా ఉన్న అంశం గురించి నా గొంతును అందిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాను. పీరియడ్‌ షేమ్‌ మన సమాజంలో అంతర్భాగమైంది. దానిని ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది. చాలామంది భారతీయ బాలికలు వీటి గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా భావిస్తుంటారు. అవగాహన లేమి కూడా దీనికి కారణం. వీలైనన్ని మార్గాలలో నా తోడ్పాటునందించేందుకు కృషి చేస్తాను’’ అని అన్నారు.
 
చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు(క్రై) సీఈవో శ్రీమతి పూజా మార్వా మాట్లాడుతూ, ‘‘పాఠశాల స్థాయిలోనే బాలికలు విద్యను ఆపడానికి బహిష్టులు కూడా ఓ కారణం. ఇప్పుడు బాడీ షాప్‌తో భాగస్వామ్యం చేసుకుని బహిష్టు ఆరోగ్యం పట్ల సామాజిక అవగాహన కల్పించనున్నాం...’’ అని అన్నారు.