శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:56 IST)

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? ఐతే త్వరపడండి..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు కేంద్రం అనుమతి ఇస్తోంది. 2021 మే 31 వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. 
 
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆప్షన్ ఎంచుకోని వారికి మాత్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది. 2004 జనవరి 1కి ముందు సెలెక్ట్ అయ్యి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ వెసులుబాటు లభిస్తుంది.
 
ఇందులో ఎన్‌పీఎస్ కన్నా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉత్తమమని చెప్పొచ్చు. పాత పెన్షన్ విధానంలో పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత లభిస్తుంది. రిటైర్మెంట్ సురక్షితమని చెప్పొచ్చు. 2021 జనవరి నాటికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 98 లక్షలుగా ఉంది. 
 
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ ఫండ్, ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్ అనేవి ఎన్‌పీఎస్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ (సాయుధ దళాలు మినహా) ఎన్‌పీఎస్ స్కీమ్ వర్తిస్తుంది.