బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (12:21 IST)

బంపర్ ఆఫర్లు ప్రకటించిన ఆ నాలుగు టెలికాం కంపెనీలు

దేశంలో ప్రైవేట్ మొబైల్ ఆపరేట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో మొబైల్ వినియోగదారులను ఆకర్షించేందుకు వీలుగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరికొన్ని ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు పోస్టు పెయిడ్‌ ప్లాలలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
జియో రూ.1499 పోస్టుపెయిడ్‌ ప్లాన్‌: ఈ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ 500 జీబీ రోల్‌ఓవర్‌ డేటాతో 300 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ కూడా అందివ్వనుంది. అలాగే స్ట్రీమింగ్‌ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+హట్‌స్టార్‌ ప్రయోజనాలు ఉన్నాయి.
 
ఎయిర్‌టెల్ రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ యొక్క అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 3 జి లేదా 4 జి రోల్‌ఓవర్ డేటాతో అపరిమిత డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఇస్తుంది. ఇది అపరిమిత కాల్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్ స్టార్, ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లకు ఒక సంవత్సరం సభ్యత్వం ఇస్తుంది.
 
వోడాఫోన్‌ ఐడియా రూ.10989 ప్లాన్‌ : వోడాఫోన్‌ ఐడియా నుంచి వచ్చిన పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.1099. ఇది అపరిమిత డేటా, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ అందజేస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్ని, హట్‌స్టార్‌, సినిమాలను కూడా అందిస్తుంది. అలాగే అమెజన్‌ ప్రైమ్‌కు సంవత్సరం పాటు సభ్యత్వాన్ని అందిస్తుంది.
 
వోడాఫోన్‌ ఐడియా రూ.1348 ఫ్యామిలీ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌: రూ.1348 ఫ్యామిలీ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో అపరిమిత డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, రెండు కనెక్షన్లు, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. అలాగే నెట్‌ప్లిక్స్‌, అమెజన్ ప్రైమ్‌, వీఐపీ డిస్నీ, హట్‌స్టార్‌లకు ఒక సంవత్సరం పాటు సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. సెకండరీ కనెక్షన్‌కు ఏ నెట్‌ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌, 50 జీబీ డేటా, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.