గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (20:24 IST)

మూడు భాష‌ల్లో ఎ.ఆర్‌.రెహ‌మాన్ చిత్రం `99 సాంగ్స్‌`

99 Songs still
‌ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ నిర్మాణ‌సార‌ధ్యంలో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్సతో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ  సినిమాతో చాలా మంది కొత్త న‌టీన‌టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు స‌హ ర‌చ‌యిత‌గానూ వ‌ర్క్ చేశారు రెహ‌మాన్‌. విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్ర‌మిది. ఇహన్ భ‌ట్ అనే ప‌వ‌ర్‌హౌస్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ను ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు ఎ.ఆర్‌.రెహమాన్. ఎడిల్‌సి వ‌ర్గ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది.
 
ఈ సంద‌ర్భంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ, ``నా నిర్మాణ సంస్థ వైఎం మూవీస్‌తో పాటు జియో స్టూడియోస్‌తో క‌లిసి `99 సాంగ్స్‌` సినిమా నిర్మాణంలో భాగం కావ‌డం ఆనందంగా ఉది. పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించే ఓ మ‌నిషి క‌థే ఈ సినిమా. ఈ సినిమాతో ఇహ‌న్ భ‌ట్‌, ఎడిల్‌సి వ‌ర్గ‌స్ వంటి న‌టీన‌టుల‌ను, విశ్వేష్ కృష్ణ‌మూర్తి వంటి డైరెక్ట‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మ‌నీషా కొయిరాలా, లీసా రే, మ్యూజిక్ లెజెండ్స్ రంజిత్ బారోట్‌, రాహుల్ రామ్ వంటి వారితో ప‌నిన‌చేయ‌డానికి అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. 
జియో స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో వైఎం మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐడిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాకు స‌హ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించింది.