ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలా..? స్కాన్ చేస్తే చాలు.. సూపర్ సర్వీస్
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలా..? ఐతే సూపర్ సర్వీస్ వచ్చేస్తోంది. అదేంటంటే? రానున్న రోజుల్లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది.
ఈ కొత్త సేవల ద్వారా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. సిటీ యూనియన బ్యాంక్ ఇప్పటికే ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్న ఏటీఎం సేవలు ఈ బ్యాంక్ కస్టమర్లకు తొలిగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్యాంక్ 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్‌తో అప్‌గ్రేడ్ చేయనుంది.
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. యూపీఐ యాప్‌ను ఓపెన్ చేయాలి. భీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ వంటి యాప్స్‌ను తెరవాలి. ఇప్పుడు ఏటీఎంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఎంత డబ్బులు తీసుకోవాలో ఎంటర్ చేయాలి. రూ.5 వేల వరకు తీసుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.