సంబంధిత వార్తలు
- ఆహా!.తమన్నాడెబ్యూ 'లెవన్త్ అవర్' టీజర్ వచ్చేసింది
- 2021 ఎర్త్ అవర్: ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఈఫిల్ టవర్ లైట్లు ఆర్పేస్తున్నారు, ఇంకా...
- దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40,953 కేసులు, 188 మంది మృతి
- మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్: 24 గంటల్లో 23,179 కేసులు
- పెళ్లికాని ప్రసాద్.. మొదటి రాత్రి గడిచాక పెళ్లి కూతురు జంప్, ఏమైంది?
బిగ్ బజార్ నుంచి తీపి కబురు.. ఆన్‌లైన్ ఆర్డర్ సర్వీసులు ప్రారంభం
Big Bazaar
ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి, అలాగే డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి బిగ్ బజార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఈ సర్వీసులు ప్రారంభించామని కంపెనీ తెలిపింది. వచ్చే 45 రోజుల్లో దేశవ్యాప్తంగా 150 పట్టణాల్లో హోమ్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది.
రోజులకు లక్ష వరకు హోమ్ డెలివరీ రిక్వెస్ట్‌లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించింది. కంపెనీ డిజిటల్ కార్యకలాపాలన పెంచుకోవడానికి అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్లు చేశామని తెలిపింది. గత 15 నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ వస్తున్నామని కంపెనీ పేర్కొంది. కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీల కింద రూ.49 వసూలు చేస్తామని తెలిపింది. రూ.1000కు పైన ఆర్డర్లకు ఇది వర్తిస్తుంది. కనీసం రూ.500 ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.
