గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (12:25 IST)

దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40,953 కేసులు, 188 మంది మృతి

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం కొత్తగా 40,953 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 25,000లకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. మధ్యప్రదేశ్‌, తమిళనాడులో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌ఘర్‌లో కూడా రెండు నెలల తర్వాత వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. జార్ఘండ్‌లో రెండు నెలల్లో మొదటిసారిగా కేసులు మూడంకెల సంఖ్యను దాటింది.
 
దేశం మొత్తం మీద 2.88 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,558. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 4 కోట్ల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అలాగే కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో.. కేంద్రం, రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నియంత్రణా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆరోగ్యం, ఇతర నిత్యావసర సేవలకు మినహా, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థంతో పనిచేయాలని శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది.