శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (22:51 IST)

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్: 24 గంటల్లో 23,179 కేసులు

మహారాష్ట్రలో బుధవారం 23,179 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే దాదాపు 30 శాతం ఎక్కువ. రాష్ట్ర రాజధాని ముంబైలో 2,377 కొత్త COVID-19 కేసులతో పాటు ఎనిమిది మంది మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 84 మరణాలు సంభవించాయి.
 
కరోనా సెకండ్ వేవ్‌ను మనం త్వరలోనే ఆపాలని బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని కోరారు. అలాగే కరోనావైరస్ పరీక్షలను పెంచాలని, మాస్క్ ధరించడాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఇటీవలి వారాల్లో, 70 జిల్లాలలో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందనీ, ప్రస్తుతం మహమ్మారిని ఆపకపోతే, ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
 
ఫిబ్రవరి ఆరంభంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 9,000 కన్నా తక్కువకు పడిపోయాయి. కాని అప్పటి నుండి క్రమంగా మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 28,903 కి చేరుకున్నాయి, డిసెంబర్ 13 నుండి అత్యధిక పెరుగుదల చోటుచేసుకుంది.