శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:51 IST)

భూతం పేరుతో నందితో నామం పెట్టిన ముఠా!

ఇంట్లో భూతం ఉందనీ, దాన్ని నందితో తరిమేస్తామంటూ ఓ మహిళను మభ్యపెట్టిన ముఠా ఒకటి... ఓ మహిళను నిలువునా ముంచేశారు. ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని, అందుకు కొంత డబ్బు ఇస్తే పూజా సామాగ్రి తెస్తామని నమ్మించి.. డబ్బుతో పారిపోయారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... నంది సాయంతో జాతకం చెబుతామంటూ మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తుల ముఠా భువనేశ్వర్‌ జిల్లా మల్కన్‌గిరికి వచ్చారు. ఇదే పేరుతో పలు కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. 
 
అదే తరహాలో మహేశ్వర కాలనీకి చెందిన మార్వాడీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో మగవారు ఎవరూ లేకపోగా.. మార్వాడీ భార్య పింకీ సూరానాతో మాట్లాడి, మీ ఇంట్లో భూతం ఉందని నమ్మించారు. ఆ కారణంతోనే అశాంతి నెలకొందని, రూ.50 వేలు ఇస్తే నంది సాయంతో భూతాన్ని తరిమేస్తానని నమ్మించాడు.
 
పూజ చేయాలని డబ్బు తీసుకొని, సామగ్రి కోసం బయటకు వెళ్లి, తిరిగి రాకుండా పరారయ్యారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తన భర్తకు విషయం చేరవేసింది. దీనిపై మల్కన్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 
 
పట్టణ శివారులో మహారాష్ట్రాకు చెందిన నలుగురు నిందితుల ముఠా తోపాటు నందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూగజీవాన్ని జిల్లా కేంద్రంలోని గోశాలకు తరలించారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.