శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (09:54 IST)

మహాశివ రాత్రి ప్రసాదం ఆరగించిన 70 మందికి అస్వస్థత... ఎక్కడ?

మహాశివ రాత్రి పర్వదినం రోజుల ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదాన్ని ఆరగించిన భక్తుల్లో 70 మంది అస్వస్థతకు లోనయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ గ్రామంలో ప్రతి యేడాది మహాశివరాత్రి రోజున శివాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఆ విధంగా గురువారం వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
 
ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అస్పూర్ ముఖ్య వైద్యాధికారి తెలిపారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. ప్రసాదం విషపూరితం కావడమే భక్తుల అస్వస్థతకు కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.