శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:01 IST)

మామిడి తోటకు దొంగతనం చేసేందుకు వచ్చారని కట్టేసి కొడుతూ పేడ తినిపించారు

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో దారుణం చోటుచేసుకుంది. తమ పెంపుడు కుక్క కనపించడంలేదంటూ ఇద్దరు బాలురు మామిడితోటలో వెతుకుతుండగా ఆ తోట కాపలాదారు వారిని పట్టుకున్నాడు. మామిడికాయలు దొంగతనం చేసేందుకు వచ్చారంటూ వారిని కట్టేసి చితక బాదడమే కాకుండా వారితో పేడ తినిపించాడు.
 
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ బిడ్డల పట్ల పశువుల కంటే హీనంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలుర పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.