శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ గొంతు కోసుకున్న ప్రియుడు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో దారుణం జరిగింది. ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ వచ్చిన ప్రియుడు ఉన్నట్టుండి గొంతుకోసుకున్నాడు. తన ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సిద్ధిపేట, స్థానిక అరుంధతి కాలనీకి చెందిన బి.మనోజ్‌కుమార్ (25) అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్‌‌గా పని చేస్తున్నడాు. ఈయన ఓ యువతితో అతడు ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. విషయం పంచాయితీ వరకు వెళ్లడంతో ఇద్దరూ దూరంగా ఉండేలా రాజీ కుదిరింది.
 
అయితే, ప్రియురాలిని విడిచి దూరంగా ఉండలేని మనోజ్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. బుధవారం రాత్రి భోజనాల తర్వాత పై అంతస్తులోని తన గదికి వెళ్లాడు. అర్థరాత్రి తర్వాత ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూనే సర్జికల్ బ్లేడ్‌తో గొంతు, మణికట్టు కోసుకున్నాడు.
 
దీంతో కంగారుపడిన ఆమె అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పై గదికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడు లేడనే వార్త తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.