సంబంధిత వార్తలు
- మైనర్ బాలికపై 55 యేళ్ళ వ్యక్తి అత్యాచారం... ఎక్కడ?
- 25మంది జోధ్‌పూర్ ఐఐటీ విద్యార్థులకు పాజిటివ్.. మహారాష్ట్ర సీఎం భార్యకు కూడా?
- ఏపీలో భూముల ధరలు పడిపోవడానికి కారణం చంద్రబాబే : మంత్రి కొడాలి నాని
- మాస్కులు పెట్టుకోలేదని పోలీసుల కేసు... కోర్టులో హాజరు
- ముక్కు అవినాష్‌కి తెలంగాణ సర్కార్ రూ. 60,000 ఆర్థిక సాయం, మొన్ననేగా గోవా వెళ్లివచ్చిందంటూ...
కెనడాలో తెలంగాణ విద్యార్థి బలవన్మరణం
కెనడాలో ఓ తెలంగాణ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాలోని డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. అయితే, ఏం కష్టం వచ్చిందో.. గురువారం ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్ తల్లితండ్రుల పేర్లు నారాయణరావు, హైమావతి. వారి సాధారణ రైతు కుటుంబం.
ఉన్నత ఆశయాలతో తమ కుమారుడు కెనడాకు వెళ్లి చదువుకుంటున్నాడని వారు చెప్పారు. కలను నెరవేర్చుకోవాలనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ వారు విలపించారు. ప్రవీణ్ కుమార్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, తమ కుమారుడి మృతేదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు కోరుతున్నారు.
