ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:59 IST)

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికా కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్‌ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.  బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు.  దీంతో వరుస  కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. 
 
దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్‌ సిటీలోని లికోయిన్‌ అవెన్యూ ఆఫీస్‌  భవనం రెండవ అంతస్తులో షూటింగ్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారి జెన్నిఫర్‌ అమాత్ తెలిపారు.  ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. 
 
పోలీసు అధికారులు అనుమానుతుడిపై  జరిపిన కాల్పుల్లో  స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతనికి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ జెన్నిఫర్ అమత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.