గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (08:40 IST)

రూ.17 ఖర్చుతో 116 కిలోమీటర్ల ప్రయాణం... ఎలా?

పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్బన ఉద్గర రహిత స్కూటర్లను తయారు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ని విడుదల చేసింది. 
 
ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే నిరాటంకంగా 116 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. 2.5 కిలోవాట్‌ లిథియం బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే కేవలం రూ.15-17 మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. ఒకసారి చార్జి చేయడం వల్ల 110 నుంచి 116 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవచ్చని పేర్కొంది. 
 
సాధారణ ఎలక్ట్రిక్‌ వాహనాలకు భిన్నంగా ఈ బ్యాటరీని ఇంట్లోని 10-15 యాంప్‌ ప్లగ్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు. నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుందని పేర్కొంది. పేటెంటెడ్‌ బ్యాటరీ సాంకేతికతో రూపొందించిన ఈప్లూటో 7జీని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) ధృవీకరించిందని ప్యూర్‌ ఈవీ ఎండీ గార్గి పచాల్‌ అన్నారు. 
 
అంతేకాదు ఒక్కసారి చార్జ్‌ చేస్తే గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు సెకన్ల లోపే అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా ఒక్క రూపాయి తక్కువగా రూ.80 వేలుగా నిర్ణయించారు.