శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By మురళీకృష్ణ
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (11:33 IST)

అక్కినేని నాగార్జున 'వైల్డ్‌ డాగ్' ఎలా వుందంటే? రివ్యూ

వైల్డ్ డాగ్ న‌టీన‌టులు: నాగార్జున, సైయామి కేర్‌, దియా మీర్జా, అలీ రెజా, త‌దిత‌రులు.
సాంకేతిక‌త: సంగీతం- ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్, నిర్మాత‌లు: నిరంజీన్ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్‌ సాల్మన్‌. స్రీన్‌ప్లే: కిర‌ణ్‌ కుమార్‌.
 
ఏప్రిల్ 1నే ఈ సినిమాను ఎవరో తమ యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేసి, వైల్డ్‌ డాగ్‌ ఫుల్‌ మూవీని అప్‌లోడ్‌ చేశారని ట్వీట్‌ చేసింది. అందులో చూస్తే. సినిమాలోని అలీ, సైయామి.. క‌న్పిస్తూ పైర‌సీని ఆపండి, థియేట‌ర్ల‌లో చూడండి అంటూ.. హ్యీపీ ఏప్రిల్ ఫూల్‌డే అంటూ కాప్ష‌న్ పెట్టారు.‌
 
బాంబ్ బ్లాస్ట్‌ల‌పై ఇంత‌కుముందు కొన్ని తెలుగు సినిమాలు వ‌చ్చాయి. కానీ అవేవీ అంత‌లా ఎట్రాక్ట్ అనిపించ‌లేదు. కానీ వైల్డ్ డాగ్ మాత్రం విదేశీ టెక్నీషియ‌న్స్ కూడా ఉప‌యోగించుకుని తీశారు.
 
ఓ చిన్న న్యూస్‌ ఆర్టికల్‌ చదివి ఇన్‌స్పైర్‌ అయ్యి వైల్డ్‌డాగ్‌ కథ రాసుకున్నాడు. 2007లో గోకుల్‌ చాట్, లుంబినీ పార్క్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌లు జరిగాయి. అప్పట్నుంచి 2015 వరకు మన దేశంలో చాలా చోట్ల బాంబ్‌బ్లాస్ట్‌లు జరిగాయి. వీటి వెనక ఐఎస్‌ఐ హస్తం ఉందని భావించిన కేంద్రప్రభుత్వం ఈ కేసులను ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ)కి అప్పగించింది.
 
ఈ వాస్తవ సంఘటనలకు కొన్ని కల్పిత అంశాలు జోడించి వైల్డ్‌డాగ్‌ను తెరకెక్కించారు. ఆరు పాటలు, ఓ కామెడీ ట్రాక్‌ ఉండే సినిమా కాదు ఇది. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అవసరమైన సన్నివేశాల్లో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారు. ద‌ర్శ‌కుడు జర్నలిజంలో మాస్‌ కమ్యునికేషన్స్ చేశారు. 
 
అత‌ని స్నేహితులు కొందరు జర్నలిజంలో ఉన్నారు. ముంబై, బెంగళూరులో ఉన్నవారిని అడిగి ఎన్‌ఐఏ గురించి, బాంబ్‌ బ్లాస్ట్‌ల గురించి కొంత రీసెర్చ్‌ చేశారు. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న కొన్ని పుస్తకాలు చదివి, ఆ అంశాలను వైల్డ్‌డాగ్‌ సినిమాలో పొందుపరిచారు.
 
కథగా చూస్తే... 
2006 నుంచి 2013 వరకు పుణెలోని జర్మన్ బేకరి, హైద్రాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ పైన కథ ఇది. ఎన్ఐఎ ఆఫీసర్ విజయ్ వర్మ(నాగార్జున) అందులో పనిచేసే నలుగురు సిన్సియర్ సిబ్బందితో పాకిస్తాన్ తీవ్రవాది ఖలీద్‌ను ఎంత రిస్క్ తీసుకుని పట్టుకున్నారు. తీవ్రవాదికి మంత్రికి సంబంధం ఏమిటీ? రా ఆఫీసర్ సయామీ ఖేర్ పాత్ర ఏమిటి అన్నది సినిమాలో చూడాల్సిందే.
 
ఈ చిత్రంలో నాగార్జున సిన్సియర్ ఆఫీసరుగా మెప్పించారు. ఇంతకుముందు ఈ తరహా పాత్రల్లో ఆయన నటించినా ఈ చిత్రంలో వున్నంత సీరియస్నెస్ లేదు. ఫుల్ యాక్షన్, థ్రిల్ కలిగించే సినిమా. అందరూ చూడవచ్చు.