ఆదివారం, 30 మార్చి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 మార్చి 2025 (23:00 IST)

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Low BP
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము.
 
తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది.
తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది.
శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
తీవ్రమైన సందర్భాల్లో, తక్కువ రక్తపోటు తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది.
లోబీపి కారణంగా జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహం తగ్గడం కొన్నిసార్లు వికారానికి కారణమవుతుంది.
తక్కువ రక్తపోటు వల్ల మెదడు పనితీరు ప్రభావితమవుతుంది, దీనివల్ల స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
తక్కువ రక్తపోటు వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవచ్చు, దీని వలన చర్మం పాలిపోయి జిగటగా మారుతుంది.