బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (22:42 IST)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

red grapes
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది.
పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు.
ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.
హైబీపి వున్నవారు ఒక్క అరటి పండు తింటున్నా బీపీ అదుపులోకి వస్తుంది.
పెద్దవుల్లిపాయలు కూడా అధిక రక్తపోటును అదుపుచేయడంలో దోహదపడతాయి.
వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి ఆరోగ్యవంతంగా వుంచుంది.
హైబీపీ వున్నవారు నిమ్మరం తాగుతుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.