High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?
Foods to avoid with high blood pressure: అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి.
ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్‌ను చేర్చవద్దు.
ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి.
బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి.
పాప్‌కార్న్ తినవద్దు.
ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
అప్పడాలు, కారంబూందీ వంటి ఉప్పు మోతాదు ఎక్కువున్నవి కూడా దూరం పెట్టేయాలి.